Monday, September 7, 2020

Wind

By Kritija

 Introduction: 

We all know that wind is a natural occurrence. In this poem, the poet talks to the wind. He also describes the power of the wind. The poet says that the power of the wind is destructive.  The poet compares the destructive power of the wind to the adversities of life. He says that the weak people break down, but stronger people emerge out of adversities, stronger.  The poem gives an important message that we should be mentally tough and physically strong in order to survive the hardships of life. A weak person breaks down like a weak building and crumbles. We must make these destructive forces our friends, with our strength and determination. 

Literary devices:  

Rhyme schemeRhyme: A rhyme is a repetition of similar sounds in the final stressed syllables and any following syllables of two or more words.The entire poem is written in free verse. 

There is no rhyme scheme in the poem.

The literary devices used are as follows – 

i. AnaphoraAnaphora is the repetition of a word or words at the beginning of successive phrases, clauses, or lines to create a sonic effect.

Lines 2, 3, 4 begin with ‘don’t’. 

Lines 6, 7, 8 begin with ‘you’.

ii. Personification – Personification is referring or representing a thing or abstraction as a person. In this poem, the wind has been personified. When the poet says ‘you are’, he is referring to wind as ‘you’ which means he is treating wind as a person.

 iii. Repetition - Repetition is the simple repeating of a word, within a short space of words to give emphasis. The word 'crumbling’ is repeated many times to lay emphasis. The poet wants to say that the wind crushes everything that is weak. That is why he repeats the word crumbling. 

 iv. AlliterationAlliteration is the repetition of identical initial consonant sounds in successive or closely associated syllables within a group of words. In this poem, the repetition of a consonant sound in closely placed words. 

‘wind winnows’. 

‘won’t want’

 v. Symbolism Symbolism is a literary device that uses symbols, be they words, people, marks, locations, or abstract ideas to represent something beyond the literal meaning. Here, 'wind is a symbol. It refers to the challenges in life. The poet is using wind as a symbol for the adversities in our life.

Summary:

The first part of the poem describes the action of the wind. The poet asks the wind to come softly. He requests the wind not to break the shutters of the windows, not to scatter the papers and throw down the books from the shelf. But the wind throws the books and tears the pages. The poet says that the wind makes a mockery of weaklings. The wind brings down frail houses, crumbling doors, rafters, and even weak hearts. It crushes everything that is weak.

The poet advises us to make friends with the wind. In order to be friends with the wind we have to be strong. Only then can we save ourselves from the wind. We have to build strong homes with sturdy doors. Our bodies and hearts must be strong. The world makes fun of weak people and makes friends of strong people. Just as the wind blows out the weak fires but makes the strong fires roar and flourish. Thus, the poem conveys the idea that nobody cares for the weak. Even the wind is on the side of the strong people. We must make ourselves strong to face the challenges in life.

 Questions and Answers

1. What are the things the wind does in the first stanza?

A. When the wind blows strongly, it destroys everything. It breaks the shutters of windows, scatters the papers, throws the books down from the shelves, and tears the pages. It also brings along rain.

 2. What does the poet say the wind god winnows?

A. The wind God winnows means that nature separates the weak things from the strong ones. Everything that is weak is tossed and blown away by the powerful wind. A winnower separates the grains of wheat from the chaff, similarly, the wind God separates the weak from the strong.

 3. What should we do to make friends with the wind?

A. We must make ourselves strong to face the violent wind. When we are strong, the wind will not harm us, instead, it will become a friend and help us to grow and flourish.

4. What do the last four lines of the poem mean to you?

A. The last four lines of the poem carry an important message that strong people emerge stronger and victorious in the face of adversities. We must make ourselves strong like a roaring fire that grows and flourishes in the violent wind. We should be strong and brave to face the challenges and flourish.

Wind poem translated into Telugu (to help better understanding)

గాలి 

గాలీ, నెమ్మది గా రా

కిటికీ తలుపులను విరిచేయకు

కాగితాలను చెల్లాచెదురు చేయకు

అరలలోని పుస్తకాలను పడవేయకు

చూడు నువ్వేం చేసావో - వాటన్నింటినీ కింద పడేసావు

పుస్తకాలలోని కాగితాలను చించేసావు

నువ్వు మళ్ళీ వర్షాన్ని తెచ్చావు

దుర్బలులని పరిహసించడం లో నువ్వు మేటివి

బాల హీనమై కూలుతున్న ఇళ్ళు, కూలుతున్న ద్వారాలు, కూలుతున్న వాసాలు

కూలుతున్న మానులు, కూలుతున్న శరీరాలు, రాలిపోతున్న  జీవితాలు,

పగులుతున్న గుండెలు  -

గాలి వీటన్నింటినీ చెరిగేసి పొడి చేసేస్తాడు

వాడు నువ్వు చెప్పినట్లు వినడు

అందుకనే రండి బలమైన ఇళ్ళని కడదాం

తలుపులను గట్టిగా బిగిద్దాం

దేహాన్ని దృఢ పరిచే సాధన చేద్దాం

గుండెని దిటవు గా చేద్దాం

ఇలా చేస్తే గాలి మన నేస్తమౌతాడు

గాలి బలహీన మైన మంటని ఊదేస్తాడు

బలమైన మంటల్ని ఎగ దోస్తాడు

అతనితో స్నేహం మంచిది

ప్రతి దినం అతనిని ప్రశంసిద్దాం 


పరిచయము:

గాలి అనేది ప్రకృతి సిద్ధమైన ఒక శక్తి అని మనందరికీ తెలుసు. కవితలో కవి గాలితో మాట్లాడుతాడు. కవి కవిత లో  గాలి గల బలాన్ని, శక్తిని వివరిస్తాడు. గాలి కి గల శక్తి వినాశకరమైనదని చెప్తూ, గాలి యొక్క విధ్వంసక శక్తిని కవి మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలతో పోల్చాడు. జీవితం లో బలహీనులు విచ్ఛిన్నమవుతారని, కానీ బలమైన వ్యక్తులు కష్టాల నుండి బయటపడతారని కవి అంటాడు. జీవితము లో ఎదురయ్యే కష్టాలను, ఒడిదుడుకులను తట్టుకుని నిలబడాలంటే మనం మానసికంగా దృఢం గా, శారీరకంగా బలంగా ఉండాలనే  ముఖ్యమైన సందేశాన్ని కవిత ఇస్తుంది. దుర్బలుడైన వ్యక్తి బలహీనమైన భవనంలా కూలిపోతాడు. మనకి తటస్థ పడే రక రకాల విధ్వంసక శక్తులను, ఇబ్బందులను మనము దృఢం గా తయారవడం వల్ల ఎదుర్కో గలుగు తాము. బలమైన శక్తులను మనము మన స్నేహితులుగా చేసుకోవాలి.

సారాంశము:

కవిత యొక్క మొదటి భాగం గాలి చేసే విచ్చిన్నకరమైన పనులను వివరిస్తుంది. గాలీ, నెమ్మది గా రా అని కవి కోరతాడు. గాలిని . కిటికీల షట్టర్లను బద్దలు కొట్టవద్దని, కాగితాలను చెల్లాచెదరు చేయవద్దని, పుస్తకాలను షెల్ఫ్ నుండి పడవేయవద్దని కవి  గాలిని అభ్యర్థిస్తాడు. కానీ గాలి కాగితాలను విసిరిపడేసి, పుస్తకాలలోని పేజీలను చింపేస్తాడు. గాలి బలహీను తో పరాచికాలు ఆడతాడు.   గాలి బలహీనమైన ఇళ్ళు, విరిగిపోతున్న తలుపులు, మానులు మరియు బలహీనమైన హృదయాలను ఛిన్నాభిన్నం చేస్తాడు. గాలి దుర్బలమైన ప్రతీ దానినీ పిండి చేసి పారేస్తాడు.

 కవి మనకి గాలితో స్నేహం చేయమని సలహా ఇస్తాడు. గాలితో స్నేహం కావాలంటే మనం బలంగా ఉండాలి. అప్పుడే మనం గాలి నుండి మనల్ని రక్షించుకోగలం. మేము ధృఢమైన తలుపులతో బలమైన గృహాలను నిర్మించాలి. మన శరీరాలు, హృదయాలు బలంగా ఉండాలి. ప్రపంచం బలహీనమైన వ్యక్తులను ఎగతాళి చేస్తుంది మరియు బలమైన వ్యక్తుల స్నేహితులను చేస్తుంది. గాలి బలహీనమైన మంటలను ఆర్పివేస్తుంది. కానీ  బలమైన మంటలు గాలి వల్ల ప్రజ్వలమై వృద్ధి చెందుతాయి.

బలహీనులను ఎవరూ పట్టించుకోరు, వారిని అందరూ అణచి వేస్తారు అనే భావన ను కవిత తెలియ చెబుతుంది. గాలి కూడా బలమైన వారి పక్షాన ఉంతాడు. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవటానికి మనల్ని మనం బలోపేతంగా చేసుకోవాలి.

 ప్రాస (రైమ్ స్కీ మ్)

పదాల చివర ఒకే రకమైన ధ్వని ని కలిగివున్న పదాలను లైన్ చివర ఉపయోగించడం. 

ఈ కవిత లో ప్రాస ఉవయోగించబడలేదు. ఇది వచన కవిత (ఫ్రీ వెర్స్) గా వ్రాయబడింది. 

 ఈ కవిత లో ఉపయోగించబడిన కవితా అలంకారములు:

అనఫోరా:: ఇది ఒక రకమైన శబ్ధా లంకారము. వినసొంపుగా ఉండేలా ఒకేలా వినిపించే పదాలను దగ్గర దగ్గర గా ఉపయోగించే విధానాన్ని అనఫోరా అంటారు. 

లైనులు  2, 3, 4  ‘don’t’. తో మొదలు అవుతాయి 

లైనులు 6, 7, 8  ‘you’ తో మొదలు అవుతాయి 

 పర్సానిఫికేషన్: పర్సానిఫికేషన్  అనేది ఏదేని ఒక వస్తువును (పదార్ధము) లేదా విషయాన్ని గానీ ఒక వ్యక్తి గా చూపించడం లేదా సంబోధించడం.  ఈ కవితలో 'గాలి' వ్యక్తీకరించబడింది. కవి గాలి ని ఒక వ్యక్తి గా భావించి ఈ కవిత ను వ్రాసాడు. 

రిపిటీషన్: పునరావృతం అనేది ఒక పదాన్ని పదే పదే ఉపయోగించడం. ఒక భావాన్ని గాని, విషయాన్ని గాని మనసుకి హత్తుకు పోయేలా చెప్పడానికి రిపిటీషన్ ను కవులు వాడతారు. ఈ కవిత లో 'crumbling' అనే పదం చాలాసార్లు పునరావృతమవుతుంది. బలహీనమైన ప్రతిదాన్ని గాలి పిండి చేసేస్తుందని చేస్తుందని కవి చెప్పాలనుకుంటున్నాడు. అందుకే అతను ఈ పదాన్ని పదే పదే వాడాడు. 

ఎలిటరేషన్ - ఒకే రకమైన కాన్సోనంట్  (హల్లు) ధ్వని గల పదాలను పదేపదే దగ్గర దగ్గర గా వాడడం.  ఈ కవితలో, దగ్గరగా వున్నపదాలలో w  యొక్క ధ్వని వాడబడింది.

‘wind winnows’.

 ‘won’t want’

సింబాలిజం - సింబాలిజం అనేది వ్యక్తులు, ప్రదేశాలు, విషయాలు  లేదా ఆలోచనలు ను సూచించే పదాలను వాటి అసలైన అర్ధాలకు మించి వేరే అర్ధం లో సంకేతం, గుర్తు లేదా చిహ్నం గా వాడడం.. ఇక్కడ, 'గాలి ఒక చిహ్నం. ఇది జీవితంలో సవాళ్లను సూచిస్తుంది. కవి మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు చిహ్నంగా గాలిని ఉపయోగిస్తున్నాడు. 


No comments:

Post a Comment